క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్న 10 మంది భారతీయులు
- April 20, 2017
అబుధాబి: అల్ అయిన్ జైలులో మగ్గుతున్న పది మంది భారతీయ యువ కార్మికులు, క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో వీరి క్షమాభిక్షపై ఓ స్పష్టత రానుంది. అల్ అయిన్ అపీల్స్ కోర్ట్, బుధవారం ఈ కేసులో విచారణను పూర్తి చేసింది. మే 25వ తేదీకి తీర్పుని వాయిదా వేసింది. 2015లో ఓ పాకిస్తానీ వ్యక్తి హత్యకు సంబంధించి పది మంది భారతీయు యువకులపై అభియోగాలు మోపబడ్డాయి. మృతుడి కుటుంబీకులు, నిందితులకు క్షమాభిక్ష ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇంకో వైపున బ్లడ్ మనీ చెల్లించేందుకు దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఎస్‌పిఎస్ ఒబెరాయ్ ముందుకొచ్చారు. ఇప్పటిదాకా ఒబెరాయ్ 78 మందికి ఇదే విధంగా బ్లడ్ మనీని చెల్లించి వారిని మరణ శిక్ష నుంచి తప్పించారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







