విదేశాలలో 'తెలంగాణ జాగృతి' అధ్యక్షుల నియామకం
- April 20, 2017
ప్రవాసీయులలో మరింత పట్టుకోసం తెలంగాణ జాగృతి మరో ముందడుగు వేసింది. విదేశాలలో తమ శాఖలను విస్తరిస్తోంది. విదేశాలలో బతుకమ్మలతో హోరెత్తించిన జాగృతి ఇకపై బంగారు తెలంగాణ, ప్రవాసీయుల సంక్షేమం కోసం మరింత చురుకుగా పని చేయాలని భావిస్తోంది. ఈ మేరకు గల్ఫ్‌లోని ఆరు దేశాలకు జాగృతి అధ్యక్షుడిగా సీహెచ్. హరిప్రసాద్‌ను నియమించారు. ఉత్తర అమెరికా దేశాలకు బండారు శ్రీధర్, యూరప్‌కు ధన్నంనేని సంపత్‌లను నియమించినట్లుగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
గల్ఫ్‌లోని సౌదీ అరేబియా శాఖకు అధ్యక్షునిగా మోజ్జం అలీ ఇఫ్తెఖార్‌ను నియమించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన 17 సంవత్సరాల నుంచి సౌదీలో తెలంగాణ వాదం వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖకు అధ్యక్షుడిగా పీచర్ల కిరణ్ కుమార్‌ను నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆయన షార్జాలో కొంతకాలంగా తెలంగాణ సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. కువైట్ అధ్యక్షునిగా నియమించబడ్డ ముత్యాల వినయ్ కుమార్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. కువైట్‌లో తెలంగాణ జాగృతికి మొదటి నుంచి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. బహ్రెయిన్ జాగృతి అధ్యక్షునిగా నియమితుడైన బర్కుంట బాబురావు కవితకు వీరాభిమాని, అక్కడి జాగృతి కార్యకలాపాలను ఆయన ముందుండి నడిపిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







