జుట్టు రాలటాన్ని తగ్గించి, వాటి పెరుగుదలను పెంచే ఆహారాలు
- April 20, 2017
బాత్ రూమ్, కిచెన్, హాల్ ఎక్కడ చూసిన మీ జుట్టే కనపడుతుందా? నిజానికి అందమైన జుట్టు కావాలాని ఎవరు కోరూకోరు! చాలా మంది జుట్టు రాలటం తగ్గింసుకోటానికి వివిధ రకాల ఉత్పత్తులు, రసాయనిక క్రీములను వాడుతుంటారు, కానీ జట్టు రాలకుండా ఉండాలంటే వీటి కన్నా ముఖ్యమైనది ఏమిటంటే "పోషకాలు". వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, వాటికీ కావాల్సిన పోషకాలు అందించబడాలి. ఆహరం నుండి పొందే పోషకాల ద్వారా జుట్టు ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా పొడవైన, వత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.
సహజంగా వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంపొందించటానికి గానూ, సరైన పోషకాలను కలిగి ఉండే ఆహార పదార్థాలను మీరు పాటించే ప్రణాళికలో కలుపుకోండి. ఆ ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది:
పచ్చని ఆకుకూరలు
మీ శరీరంలో సీబం ఉత్పత్తికి విటమిన్ 'A' మరియు విటమిన్ 'C' లు అవసరం, వీటిని నేచురల్ హెయిర్ కండిషనర్ లుగా పేర్కొంటారు. ఇవి సహజంగా వెంట్రుకల మొదల్లు లేదా ఫాలికిల్ నుండి ఉత్పత్తి అవుతాయి. స్పీనాచ్, బ్రోకలీ వంటి వాటిలో ఈ పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. వీటితో పాటుగా, ఆకుకూరల నుండి కాల్షియం మరియు ఐరన్ వంటి పోషకాలను కూడా పొందుతారు.
నట్స్
మీ స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండటానికి సెలీనియం అవసరం. మీ స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మూలకం తప్పని సరి. బ్రెజిల్ నట్స్ అధిక మొత్తంలో సెలీనియం కలిగి ఉంటుంది. ఆల్ఫా-లియోనిక్ ఆసిడ్ మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లను కలిగి ఉండే వాల్నట్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటితో పాటుగా జుట్టు రాలటాన్ని తగ్గించే జింక్ మీ ఆహార ప్రణాళికలో ఉండేలా జాగ్రత్త పడండి. కావున జింక్ అధిక మొత్తంలో ఉండే బాదం, జీవిపప్పు, పీచెస్ వంటి వాటిని రోజు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోండి.
బీన్స్ మీరు రోజు పాటించే ఆహార ప్రణాళికలో కిడ్నీ బీన్స్ మరియు లెంటిస్ లను తప్పక కలుపుకోండి. ఇవి మనకు కావాల్సిన ప్రోటీన్ లను మాత్రమే కాకుండా,అ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వీటితో పాటుగా జింక్, ఐరన్ మరియు బయోటిన్ వంటి అనేక పోషకాలను అందిస్తుంది. బయోటిన్ లోపం వలన వెంట్రుకలు పొలుసులుగా మారి, తెగిపోతాయి.
క్యారెట్
విటమిన్ 'A' అధిక మొత్తంలో కలిగి ఉండే క్యారెట్ జుట్టు పెరుగుదలను పెంచటమే కాకుండా, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. మనం రోజు తినే సలాడ్ లలో లేదా స్నాక్స్ గా వీటిని జోడించటం వలన జుట్టు షైనీగా మారుతుంది.
హోల్ గ్రైన్స్ జింక్, ఐరన్, విటమిన్ 'B' వంటి పోషకాలు హోల్ వీట్ బ్రెడ్ మరియు శుద్ధి చేసిన హోల్ గ్రైన్స్ లలో కూడా ఇది అధికంగా ఉంటాయి. రాత్రి భోజనానికి ముందుగా స్నాక్స్ గా వీటిని తీసుకోండి.
ఫ్యాట్ తక్కువగా గల పాల ఉత్పత్తులు.
మీగడ తొలగించిన పాలు మరియు పెరుగు కాల్షియం మరియు ప్రోటీన్ లను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. కాటేజ్ చీస్ మరియు యోగ హార్ట్ వంటి వాటిని స్నాక్స్ గా రోజు సాయంత్రం తినవచ్చు. మీ జుట్టు రాలటం తగ్గి, వాటి పెరుగుదల బాగుండాలంటే ఫ్యాట్ తొలగించిన పాలలో ఒమేగా -3 ఫాటీ ఆసిడ్ లను, జింక్ లను కలిగి ఉండే ఫ్లాక్స్ సీడ్స్ మరియు వాల్నట్స్ లను కలిపి తీసుకోండి.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









