మాల్స్‌లో ఉద్యోగాలు సౌదీలకు మాత్రమే: లేబర్ మినిస్ట్రీ
- April 21, 2017
జెడ్డా: షాపింగ్ మాల్స్‌లో ఉద్యోగాలు ఇకపై సౌదీ నేషనల్స్‌కి మాత్రమేనని లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ వెల్లడించింది. మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ (అలి అల్ ఘోఫైస్), ఈ మేరకు ఓ ఆర్డర్‌ని విడుదల చేశారని మినిస్ట్రీ అధికార ప్రతినిథి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చర్య ద్వారా సౌదీ మహిళలకు పెద్ద సంఖ్యలో ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. సౌదీలో నిరుద్యోగాన్ని 11.6 శాతం నుంచి 2030 నాటికి 7 శాతానికి తగ్గించే చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. కింగ్‌డమ్‌లోని రిటైల్ సెక్టార్‌లో సౌదీల సంఖ్య ఐదో వంతు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే సౌదీలకు ఎక్కువ అవకాశాలు కల్పించేందుకోసం షాపింగ్ మాల్స్‌లో ఉద్యోగాలు సౌదీలకే కల్పించాలని నిర్ణయించారు. 2020 నాటికి అదనంగా ఓ మిలియన్ సౌదీలకు ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









