ఇంధన ట్యాంకర్ ను ' ఢీ ' కొట్టిన కారు మంటలలో సజీవ దహనమైన టాక్సీ డ్రైవర్

- April 21, 2017 , by Maagulf
ఇంధన ట్యాంకర్ ను ' ఢీ ' కొట్టిన కారు మంటలలో సజీవ దహనమైన టాక్సీ డ్రైవర్

 స్థానిక జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున  33 టన్నుల పెట్రోలియంను తీసుకెళుతున్నఇంధన ట్యాంకర్ ను ఓ కారు వేగంగా ఎదురుగా వచ్చి ' ఢీ ' కొట్టిన ఘటనలో టాక్సీ డ్రైవర్ కాలి బుగ్గిగా మారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు  సివిల్ డిఫెన్స్ తెల్పింది. ఈ ప్రమాదంపై  త్వరితగతిన జోక్యం చేసుకున్న సంబంధిత అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ఈ వాహనాలు ఒకదానితో ఒకటి 'ఢీ' కొన్నాయి.  దీంతో శుక్రవారం ఉదయం జెడ్డా-మక్కా వేగవంతమైన మార్గంలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. కనీసం మరో రెండు కార్లు సైతం మంటల్లో చిక్కుకున్నాయిని మక్కా సివిల్ డిఫెన్స్ ప్రతినిధి నఇఫ్ అల్-షరీఫ్ చెప్పారు. ఆకస్మికంగా జరిగిన ఈ ప్రమాదంలో టాక్సీ డ్రైవర్ మంటలలో సజీవ దహనం కాగా మరో ముగ్గురు ఈ ప్రమాదం నుండి రక్షించబడ్డారు. అగ్నికీలలలో  బూడిదగా మాదిరిపోయిన ఆ కారు డ్రైవర్ ఎవరో వెంటనే గుర్తించబడలేదు. శుక్రవారం వేకువజామున 1గంటకు ఈ దుర్ఘటన జరిగింది. మక్కా నుండి అగ్నిమాపక బృందాలు హుటాహుటిన సన్నివేశానికి చేరుకొన్నారు తెలిపారు. అగ్నిమాపక దళాలు ఆయిల్ టాంకర్ ...కారు నుంచి వెలువడుతున్న మంటల్ని అదుపు చేసిన తర్వాత హైవేలో వెదచల్లబడిన  చమురు తెట్టుని తొలగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com