ఒమనీ బాధితుడి కోసం మెర్సీ ఫ్లైట్
- April 21, 2017
చైనాలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒమన్కి చెందిన వ్యక్తిని స్వదేశానికి తీసుకొచ్చేందుకోసం రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానాన్ని పంపింది. బాధితుడికి చైనాలో సర్జరీ జరుగగా దురదృష్టవశాత్తూ శస్త్ర చికిత్స వికటించి, కోమాలోకి వెళ్ళిపోయాడు. కమర్షియల్ విమానాల్లో వచ్చేందుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఒమన్ ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించింది. పౌరుల పట్ల సుల్తాన్ బిన్ కబూస్ బిన్ సైద్ చూపించే దయ నేపథ్యంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానాన్ని చైనాకి పంపించింది. విమానం శనివారం ఒమన్కి చేరుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







