గ్రీన్ ఏసీల వైపు మొగ్గు చూపుతున్న రెసిడెంట్స్
- April 21, 2017
ఖతార్‌లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండడంతో, రెసిడెంట్స్ గ్రీన్ ఎయిర్ కండిషనర్లపై దృష్టి పెట్టారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిపైనే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్, ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్, ఖతార్ జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ సహకారంతో జులై 1, 2016 నుంచి కన్వెన్షనల్ ఏసీలను బ్యాన్ చేశారు. లులు గ్రూప్ షానవాస్ పిఎం మాట్లాడుతూ, ప్రభుత్వ తాజా నిబంధనలతో అమ్మకాలు తగ్గాయని చెప్పారు. సమ్మర్ సందర్భంగా విడుదల చేసిన కొత్త రెగ్యులేషన్స్‌తో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే మార్కెట్ ఇప్పుడు కొత్తగా ముస్తాబవుతోందని, గ్రీన్ ఏసీల ధర ఎక్కువగా ఉన్నా వినియోగదారులు వాటి పట్ల ఆకర్షితులవుతున్నారని వివరించారు. సాధారణ ఏసీ 2000 ఖతారీ రియాల్స్ ఉంటే, వాటికన్నా అదనంగా 500 నుంచి 1000 ఖతారీ రియాల్స్ ఎక్కువ మొత్తానికి గ్రీన్ ఏసీలు లభిస్తున్నాయన్నారు. ఎయిర్ ప్యూరిఫికేషన్స్, యాంటీ మైక్రోబయాల్ యాక్షన్, స్పెషల్ ఫ్రాగ్రెన్సెస్, బేబీ ఫ్రెండ్లీ, ఐయానైజింగ్ తదితర సౌకర్యాలతో కొత్త ఏసీలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







