బ్రూస్ లీ ఆడియో వేడుక

- October 03, 2015 , by Maagulf
బ్రూస్ లీ ఆడియో వేడుక

బ్రూస్‌లీ సినిమాలో నటించేందుకు రామ్‌చరణ్ ఎంతో శ్రమించారని నటుడు చిరంజీవి కితాబిచ్చారు. శుక్రవారం బ్రూస్‌లీ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్రూస్‌లీలో తన పాత్ర గురించి అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారని అన్నారు. బ్రూస్‌లీ సినిమాలో తన ఎంట్రీ కొస మెరుపు లాంటిదని చిరంజీవి అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పాలంటే సంపూర్ణంగా భోజనం చేసిన తర్వాత ఒక స్వీటు తిన్నట్టు ఉంటుందన్నారు. తమకు ఇన్‌స్పిరేషన్ అభిమానులేనని చెప్పారు. సినిమా ఎలాగు రిలీజ్‌కు దగ్గరకు వచ్చింది కాబట్టి సినిమాలోని డైలాగ్ చెప్పడానికి వెనుకాడనని ఒక డైలాగ్ చెప్పారు. బ్రూస్‌లీలో రామ్‌చరణ్ కొట్టిన బాస్ మీ స్టెమినోను, మీ స్పీచ్‌ను అందుకోలేను బాస్ అనే డైలాగ్‌ను చెప్పారు. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తన అందచందాలతో అలరించారని కితాబిచ్చారు. సినిమాకు ఒక రూపు వచ్చేలా నటించారని అన్నారు. రకుల్‌కు ప్రత్యేక అభినందలను తెలిపారు. తన 150 సినిమా పూర్తి స్థాయిలో ఉంటుందని ఆయన చెప్పారు. తన సినిమా వివరాలను 15 రోజుల్లో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. తన 150 సినిమాను రామ్ చరణ్, సురేఖ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా, రామ్ చరణ్, రుకల్ ప్రీత్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ తెరకెక్కింది. ఈ చిత్రానికి ఎన్ఎన్ ధమన్ స్వరాలు సమకూర్చారు. రామాజోగయ్య శాస్త్రి నాలుగు పాటలు రచించారు. దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన లే ఛలో అనే పాటను ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల మంది వీక్షించడం ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు ధమన్ అన్నారు. ఆడియో విడుదల కార్యక్రమంలో నిర్మాత దానయ్యతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్సకుడు శ్రీను వైట్ల, రామ్ చరణ్ తేజ, రకుల్ ప్రీత్, కృతి కర్బంద, సాయి ధర్మ తేజ్, సంగీత దర్శకుడు ధమన్, పాటల రచయిత రాం జోగయ్య శాస్త్రి, ప్రముఖ కోన వెంకట్, వివి వినాయక్, రచయిత గోపి మోహన్ తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com