ఓయూకు రాష్ట్రపతి.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- April 25, 2017
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, ఇఫ్లూ స్నాతకోత్సవాల్లో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. మరికొన్నిచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఓయూ మార్గంలో ఈ ఆంక్షలు కొనసాగించనున్నారు. బేగంపేట నుంచి ఓయూ మార్గంలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఓయూ శతాబ్ది వేడుకల అనంతరం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజ్‌భవన్‌కు వెళ్లనుండటంతో ఓయూ నుంచి రాజ్‌భవన్ వైపు మార్గంలో మధ్యాహ్నం 1.15 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం రాజ్‌భవన్ నుంచి రాష్ట్రపతి గచ్చిబౌలికి వెళ్లనుండటంతో ఈ సందర్భంగా రాజ్‌భవన్ నుంచి గచ్చిబౌలి మార్గంలో రేపు సాయంత్రం 4గంటల నుంచి 4.45 వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగించనున్నారు. ఇఫ్లూ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని దిల్లీకి వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







