'సూర్యాభాయ్'గా జగపతిబాబు
- April 25, 2017
జగపతిబాబు హీరోగా అర్జున్ వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సూర్యాభాయ్’. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని మంగళవారం విడుదల చేశారు. ఇప్పటి వరకు 3 షెడ్యూళ్లు పూర్తయ్యాయని, మే 5 నుంచి చివరి షెడ్యూల్ ప్రారంభం కానుందని చిత్ర బృందం పేర్కొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జులైలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం మాట్లాడుతూ.. ‘జగపతిబాబు ఇందులో పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రదీప్‌రావత్, సుమన్, సాయికుమార్, అర్చన ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నటి ఇందులో జగపతిబాబు సరసన నటిస్తున్నారు’ అన్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









