బహ్రెయిన్ తెలుగు కళాసమితి ఉగాది వేడుకలు
- April 25, 2017
ఏప్రిల్ 21న బహ్రెయిన్ తెలుగు కళా సమితి, ఉగాది వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్, ఈ కార్యక్రమానికి ముక్య అతిథిగా హారయ్యారు. తెలుగు వారికి ఉగాది ఎంతో ప్రత్యేకమైన పండుగ కావడంతో, పెద్ద సంఖ్యలో తెలుగువారు ఈ పండుగకి హాజరై, ఆనందోత్సాహాల మధ్య ఉగాది వేడుకల్ని జరుపుకున్నారు. నోరూరించే పిండి వంటలు, ప్రత్యేక తెలుగు వంటకాలతో ఉగాది సంబరాలు మిన్నంటాయి. ఏప్రిల్ 21న ఉదయం 9.30 నిమిషాలకు బహ్రెయిన్ కేరళీయ సమాజంలో ఈ వేడుకలు జరిగాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతుల్ని అలరించాయి. పంచాంగ పఠనం, సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటికలతో ఉగాది వేడుకల్ని సంప్రదాయ బద్ధంగా నిర్వహించడం గమనించదగ్గ అంశం.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







