చిరంజీవి 151 సినిమా ఆగస్ట్ నుంచి
- April 26, 2017
''ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో వంద రోజుల ఆడటం కష్టం. పెద్ద నోట్ల రద్దు సమయంలో కూడా 'ఖైదీనంబర్ 150' సినిమా వందరోజులు ఆడిందంటే అది అభిమానుల వల్లే. ఆ ఉత్సాహంతో నాన్న 151వ సినిమాను ఆగస్ట్‌లో ప్రారంభించబోతున్నాం.. ఇప్పటి వరకూ కనిపించని పాత్రల్లో ఆయన కనిపిస్తారు'' అని రాంచరణ్ అన్నారు. మండుటెండల్లో కూడా 20రోజులుగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నారాయన. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రాంచరణ్ మాట్లాడుతూ ''నాన్న సినిమా ఆగస్ట్‌లో మొదలుపెడతాం. బాబాయ్ ఎండల్ని కూడా లెక్క చేయకుండా అభిమానుల కోసం సినిమా చేస్తున్నారు. ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి.
రాజకీయ పరంగా, ఇంకే రకంగా అయినా బాబాయ్ చేసే ప్రతి కార్యక్రమానికి అభిమానులు అండగా ఉండాలి. నా సినిమా విషయానికొస్తే సుకుమార్ మంచి కథ చెప్పారు. అన్ని రకాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తుందీ సినిమా'' అని అన్నారు. ''20 రోజులుగా పోలవరం, టేకూరు గిరిజన ప్రాంతాల్లో, ఫోన్ కూడా పనిచేయని ప్రదేశంలో షూటింగ్ చేస్తున్నారు చరణ్.
ఆదివారం షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో అభిమానుల తాకిడి ఎక్కువకావడంతో షూటింగ్ క్యాన్సిల్ చేశాం. షూటింగ్ చూడడానికి వచ్చిన ఓ అభిమాని కుమారుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుంటే చరణ్ స్వయంగా వైద్య సదుపాయాలు కల్పించారు'' అని స్వామినాయుడు తెలిపారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







