'భరత్ అను నేను' మే 18 నుంచి
- April 26, 2017
మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'స్పైడర్' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఆ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించాలని ఆయన నిర్ణయించుకొన్న విషయం తెలిసిందే. 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఆ ఇద్దరూ కలసి పనిచేస్తున్న సినిమా ఇది. 'భరత్ అను నేను' పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మించనున్నారు. ముఖ్యమంత్రిగా మహేశ్ నటించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 18న హైదరాబాద్‌లో మొదలవుతుందని విశ్వసనీయ సమాచారం. ఆ నెలాఖరు వరకు తొలి షెడ్యూల్ నిర్వహించి, రెండో షెడ్యూల్‌ను జూన్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంతో నాయికగా కియారా ఆడ్వాణీ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆమె హిందీ సినిమా 'ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ'లో ధోనీ భార్య సాక్షిగా నటించి అందరి మన్ననలూ పొందారు.
ఇప్పుడు మహేశ్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. కాగా ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే మూడు పాటలకు స్వరాలు కూర్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలనేది దర్శక నిర్మాతల సంకల్పం.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







