డ్రగ్స్‌ బాధితుల కోసం ప్రత్యేక వైద్య విధానాలు

- October 03, 2015 , by Maagulf
డ్రగ్స్‌ బాధితుల కోసం ప్రత్యేక వైద్య విధానాలు

డ్రగ్స్‌ బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి ప్రైవేటు ఆసుపత్రులు డ్రగ్స్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా కొత్త నిబంధనల్ని రూపొందించారు. ఇప్పటికే పలు ప్రైవేటు ఆసుపత్రులు డ్రగ్స్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నా, వాటిల్లో చాలావరకు లైసెన్స్‌ లేనివే. సమస్య తీవ్రతను తెలుసుకున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రైవేటు ఆసుపత్రులు సమర్థవంతంగా డ్రగ్స్‌ బాధితులకు సాంత్వన చేకూర్చేలా ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తామని వెల్లడించింది. 2013 నాటికి సుల్తానేట్‌లో డ్రగ్స్‌ బాధితుల సంఖ్య 4079గా ఉంది. 2015లో ఈ కేసుల సంఖ్య 5 వేలకు చేరుకోవడంతో యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్‌ బాధితులకు సేవలందించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ డగ్స్‌ మరియు సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ ఎఫైర్స్‌ సెక్రెటరీ డాక్టర్‌ మొహమ్మద్‌ జహెర్‌ అల్‌ అబ్రి వివరించారు. డ్రగ్స్‌పై నిషేధం ఇంకా కఠినంగా అమలు చేయడం, బాధితులు డ్రగ్స్‌ వైపు వెళ్ళకుండా చేయడం వంటి ప్రోగ్రామ్స్‌ కూడా ఈ మిషన్‌ ద్వారా చేపట్టనున్నారట. 

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com