తెలంగాణా లో ఈ నెల 12 నుంచి 20 వరకు బతుకమ్మ సంబరాలు

- October 03, 2015 , by Maagulf
తెలంగాణా లో ఈ నెల 12 నుంచి 20 వరకు బతుకమ్మ సంబరాలు

తెలంగాణా  మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే బతుకమ్మ పండుగను వైభవోపేతంగా నిర్వహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. బతుకమ్మ పండుగ నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా ప్రభుత్వం ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించనుంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో బతుకమ్మ నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఎల్బీ స్టేడియంలో చివరిరోజు బతుకమ్మలను పేర్చుకుని మహిళలతో ట్యాంక్‌బండ్‌ వరకు ఊరేగింపు ఉంటుంది. అలాగే ఊరేగింపుతోపాటు మంగళవాయిద్యాలు, మేళతాళాలు, కళాకారులు తెలంగాణా కళలను ప్రదర్శించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com