తెలంగాణా లో ఈ నెల 12 నుంచి 20 వరకు బతుకమ్మ సంబరాలు
- October 03, 2015
తెలంగాణా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే బతుకమ్మ పండుగను వైభవోపేతంగా నిర్వహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. బతుకమ్మ పండుగ నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా ప్రభుత్వం ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించనుంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో బతుకమ్మ నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఎల్బీ స్టేడియంలో చివరిరోజు బతుకమ్మలను పేర్చుకుని మహిళలతో ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపు ఉంటుంది. అలాగే ఊరేగింపుతోపాటు మంగళవాయిద్యాలు, మేళతాళాలు, కళాకారులు తెలంగాణా కళలను ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







