భారీ దోపిడీ హాలివుడ్ సినిమాను తలపించేలా
- April 26, 2017
ఇది సినిమా కాదు. బ్రెజిల్, పరాగ్వే, అర్జెంటీనా సరిహద్దుల్లో జరిగిన యదార్థ ఘటన. పరాగ్వే సరిహద్దు నగరం సియుడాడ్ డెల్ ఎస్టేలో సినిమాలను తలదన్నే దోపిడీ జరిగింది. నగదు సరఫరాచేసే ప్రైవేట్ సంస్థపై దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు.
దోపిడీ జరిగింది ఏ అర్థరాత్రో ..అపరాత్రో కాదు. పట్టపగలు ఏకంగా 50 మంది దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. దొంగలు మొదట బ్రెజిల్ నుంచి సరిహద్దులు దాటి పరాగ్వేలోని సియుడాడ్ డెల్ ఎస్టే నగరంలోకి చొరబడ్డారు. ప్రొసెగర్ అనే ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలోని ఖజానా వారి టార్గెట్. నగదును సురక్షితంగా సరఫరా చేసే సంస్థ అది. వారు దాడిచేసే సమయానికి ఆ వాల్ట్ పూర్తిగా నగదుతో నిండి ఉంది. ఆ సొమ్ము విలువ 40 మిలియన్ డాలర్లు.
అధునాతన వాహనాల్లో అక్కడికి చేరుకున్న దొంగలు భారీ పేలుడు పదార్థాలతో, డైనమైట్లతో సంస్థ ముందు భాగాన్ని పేల్చివేసి లోపలికి చొరబడ్డారు.మొత్తం ఖజానాను కొల్లగొట్టి వెనుదిరిగారు. ఆ పేలుడు శబ్దాలకు అప్రమత్తమైన పోలీసులు అక్కడికి రాకుండా దుండగుల్లో కొందరు వేరయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు కార్లు, ట్రక్కులు, లారీలను తగలబెట్టేశారు. టైర్లను పంక్చర్ చేసే ఇనప ముక్కలు దారిలో వెదజల్లారు. బ్రెజిల్‌లోకి వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఆ దుండగులను పరాగ్వే పోలీసులు వెంటాడారు. సమాచారం తెలుసుకున్న బ్రెజిల్ పోలీసులుకూడా వారికి జత కలిశారు.
దొంగలు ఇరుదేశాల పోలీసులపైనా హోరాహోరీగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించగా.. ముగ్గురు దొంగలు హతమయ్యారు. మరో నలుగురు తీవ్రగాయాలపాలై పోలీసులకు దొరికిపోయారు. మిగతావారు తప్పించుకున్నారు. దుండగులకు చెందిన కొన్ని వ్యాన్లను, లైఫ్ జాకెట్లను, మెషీన్గన్లను, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డైనమైట్లు పేల్చి భవంతిని పేల్చేశారు. ఎవరూ ఊహించని రీతిలో జరిగిన ఈ భారీ దోపిడీని పరాగ్వే అధికారులు ఈ శతాబ్దపు దోపిడీగా అభివర్ణిస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







