నిర్మాణ స్థలం వద్ద ఓ వ్యక్తి సజీవంగా పూడ్చివేత్... 5 గంటల తరువాత వెలికితీత

- April 27, 2017 , by Maagulf
నిర్మాణ స్థలం వద్ద  ఓ వ్యక్తి  సజీవంగా పూడ్చివేత్... 5 గంటల తరువాత వెలికితీత

భూమి మీద నూకలుంటే ....భూమిలో పాతి పెట్టినప్పటికీ ఎంచక్కా బతికి బైట పడతాం అనడానికి ఈ వార్త ఓ ఉదాహరణ... అల్ బర్సా ప్రాంతంలో ఒక నిర్మాణ ప్రదేశంలో ఓ వ్యక్తి లోతైన గొయ్యిలో చిక్కుకునిపోయాడు. అత్యవసర కార్మికులంతాఅక్కడకి వచ్చి రక్షించేవరకు దాదాపుగా, సజీవంగా పాతిపెట్టినట్లుగా ఉండిపోయాడని పోలీసులు మంగళవారం చెప్పారు.భూగర్భ జలాలతో నిండిన ఆ లోతైన గొయ్యి నుండి ఆ ఆసియా దేశాలకు చెందిన వ్యక్తిని సురక్షితమైన స్థలంలోకి తీసుకురావడానికి సహాయ చర్యలు అయిదు గంటల పాటు శ్రమించి రక్షించారు.. ఇసుక మరియు కంకరల నడుమ చిక్కుకొన్న ఆ  వ్యక్తిని రక్షించినట్లు రెస్క్యూ దళం పేర్కొన్నారు. దుబాయ్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్మా అహ్మద్ ఆటిక్ బు రుకీబా తెలిపిన సమాచారం ప్రకారం ఈ సంఘటన సోమవారం ఉదయం 8:15 సమయంలో నిర్మాణం జరుగుతున్న అల్ బర్సా 4 వ ప్రాంతంలో ఐదు గంటల పాటు ఆ కార్మికుడు ఆ గోతిలో చిక్కుకొనిపోయాడు.  అత్యవసర ఫోన్ కాల్ అందిన తర్వాత మేము 10 నిమిషాల తరువాత ఆ  స్థలానికి  చేరుకున్నామని ఆ  కార్మికుడు నీరు కలిగి ఉన్నఒక పెద్ద గోతిలో పడిపోయాడు - ఇసుక మరియు కంకర అతనిని పీకల వరకు  ఖననం చేసింది. రక్షణ కార్యకలాపాలు ఐదు గంటలు కొనసాగాయి, ఇది మాకు కఠినమైన లక్ష్యమైనప్పటికీ విజయవంతంగా పూర్తిచేసేమని లెఫ్టినెంట్ కల్ బు రుకీబా చెప్పారు.కాప్టెన్ అబ్దుల్లా అల్ రహ్ూమీ నేతృత్వంలోని రెస్క్యూ బృందం సహాయ చర్యను నిర్వహించింది. అత్యవసర కార్మికులు యాంత్రిక సంబంధిత పరికరాలను, నీటి పంపు మరియు ఇతర రెస్క్యూ సామగ్రిని ఉపయోగించి ఆ  కార్మికుడిని వెలుపలికి తీసి రక్షించారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్, దుబాయ్ అంబులెన్స్, దుబాయ్ మున్సిపాలిటీ అత్యవసర సిబ్బంది పాల్గొంటున్నారని కాప్ అల్ రహూమి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com