22 వారాలకే జననం
- April 27, 2017
దుబాయ్, యూఏఈ: కువైటీ దంపతులకు ఓ చిన్నారి కేవలం 22 వారాలకే జన్మించింది. సాధారణంగా ఈ వయసులో జన్మించే చిన్నారులు జీవించే అవకాశాలు అరుదు. అయితే పుట్టిన బిడ్డకు సరైన వైద్య సహాయం అందించడంతో ప్రస్తుతం బేబీ ఎదుగుదల బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. జులేకా ఆసుపత్రిలో జన్మించిన ఆ బేబీ పేరు నౌరా. కేవలం 600 గ్రాముల బరువుతో జన్మించింది ఈ చిన్నారి. జనవరి 30న ఈ బేబీ జన్మించగా, మూడు నెలలకు ఆమె బరువు 1.5 కిలోలుగా ఉంది. తల్లికి యూరిన్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ ముందస్తు జననం సంభవించింది. కువైట్ నుంచి సెలవుల కోసం వచ్చిన దంపతులు, అనుకోని ఇబ్బందుల్లో ఈ విధంగా ఇరుక్కున్నారు. స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ నాదా ఎల్షేక్, కన్సల్టెంట్ నియోనాటలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ నబీల్ ఖలాఫ్ సేఫ్ డెలివరీ విషయంలో చాకచక్యంగా, నేర్పుగా వ్యవహరించారు. ప్రత్యేకంగా బ్రీతింగ్ కోసం ఏర్పాట్లు చేశామని, మొదట్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని భావించినా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రోగ్రెస్ బాగా లభించినట్లు వైద్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







