'గల్ఫ్' సినిమా బృందం ఆధ్వర్యంలో జగిత్యాలలో నేడు గల్ఫ్ అమరుల దినోత్సవం
- April 27, 2017
విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన, వికలాంగులైన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 28 ఏప్రిల్ న నిర్వహించే అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవాన్ని (ఇంటర్నేషనల్ వర్కర్స్ మెమోరియల్ డే International Workers' Memorial Day) తాము గల్ఫ్ అమరుల దినోత్సవంగా (గల్ఫ్ మార్టియర్స్ డే Gulf Martyrs Day) జరుపుతున్నామని 'గల్ఫ్' సినిమా అంబాసిడర్ తంగెళ్ల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం తేది: 28.04.2017 సాయంత్రం 4గం.ల 6గం.ల వరకు జగిత్యాలలోని తహశీల్ చౌరస్తా శివసాయి హోటల్ లో గల్ఫ్ అమరుల దినోత్సవం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణాకు చెందిన ప్రవాసీ కార్మికులు గల్ఫ్ దేశాలలో సంవత్సరానికి 200 కు పైగా చనిపోతున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) చెల్లించాలని తంగెళ్ల రమేష్ డిమాండ్ చేశారు. చనిపోయినవారిని స్మరించండి - బ్రతికున్నవారి కోసం పోరాడండి అని పిలుపునిచ్చారు.
భారత ప్రభుత్వం కార్మికులను (మానవ వనరులను) ఎగుమతి చేసి ఇంధనాలను దిగుమతి చేసుకుంటుంది. ఇది పక్కా ఎగుమతి, దిగుమతి వ్యాపారం. కార్మికులు తమ భార్యా బిడ్డలను, తల్లి దండ్రులను, కుటుంబాన్ని, కన్న ఊరును, ఈ దేశాన్ని వదిలి విదేశాల్లో ఒంటరిగా జీవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎడబాటుతో బాధపడుతున్నారు. వీరి త్యాగాలకు మనం వెల కట్టగలమా ? ఈ దేశం కోసం డ్యూటీలో భాగాంగా ఎడారిలో దిక్కులేని వారిగా చనిపోయిన మన గల్ఫ్ ప్రవాసీ కార్మికులను "గల్ఫ్ అమరులు" అని పిలుచుకుందాం అని ఆయన అన్నారు.
ఇట్లు: తంగెళ్ల రమేష్ సెల్: 94400 71161
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







