రాజధాని నిర్మాణంలో డిజిటల్ ఇటుకలను వాడేందుకు సిద్ధం

- October 03, 2015 , by Maagulf
రాజధాని నిర్మాణంలో డిజిటల్ ఇటుకలను వాడేందుకు సిద్ధం

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో రాళ్లు, ఇటుకలతోపాటు ఇప్పుడు డిజిటల్ బ్రిక్స్ కూడా చేరబోతున్నాయా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. రాజధాని నిర్మాణంలో డిజిటల్ ఇటుకలను వాడేందుకే చంద్రబాబు రెడీ అవుతున్నారు. అసలు ఈ డిజిట‌ల్ బ్రిక్స్ అంటే ఏంటి ? వాటిని ఎలా వాడతారో మీరే చూడండి. భాగస్వామ్యం కావాలంటే ఏం చేయాలి ? నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజథాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటే ఏం చేయాలి.? సీఎం చంద్రబాబు అన్నట్లుగా ఇంటికో ఇటుక ఇవ్వాలా? లేకపోతే..ఇటుకతో సమానమైన డబ్బును విరాళంగా ఇవ్వాలా అన్నదే ప్రశ్న. దీనికి సమాధానం..మీరు శ్రమటోడ్చి ఇటుకను ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఇటుకతో సమానమైన డబ్బును ఆన్‌లైన్‌ అకౌంట్లో జమచేస్తే చాలు. అంతే మీరు అమరావతి నిర్మాణంలో భాగస్వాములైనట్లే..మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అదెలాగో చూడండి. కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ బ్రిక్స్ డిజిటల్ బ్రిక్స్ అందించే విధానం పూర్తిగా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com