చాలా కాలం తర్వాత వెంకటేష్ కొత్త సినిమా
- October 03, 2015
'గోపాల గోపాల' సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్.. త్వరలోనే ఓ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మారుతి, క్రాంతి మాధవ్ లాంటి దర్శకుల చెప్పిన కథలకు ఓకె చెప్పిన వెంకీ, ఎవరు ముందుగా కథ రెడీ చేస్తే వారితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ గ్యాప్ లో నాగచైతన్య చేస్తున్న సినిమాలో అతిథి పాత్రలో నటించనున్నాడు వెంకీ. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న చైతూ ఆ సినిమా పూర్తవ్వగానే మళయాల సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్' రీమేక్ లో నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడానికి సీనియర్ స్టార్ వెంకటేష్ అంగీకరించాడు. తన మేనల్లుడు నాగచైతన్య స్వయంగా అడగటంతో ఈ క్యారెక్టర్ చేయడానికి వెంకీ వెంటనే ఒప్పేసుకున్నాడు. ఒరిజినల్ వర్షన్ లో అనంత్ నాగ్ నటించిన పాత్రలో తెలుగులో వెంకీ దర్శనమివ్వనున్నాడు. 'కార్తీకేయ' ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, దిశాపటానీ, అనుపమా పరమేశ్వరన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమమ్ తెలుగు రీమేక్ కు మజ్ను అనే టైటిల్ ను ఫైనల్ చేశారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







