కార్గోలో వచ్చి.. బిజినెస్ క్లాస్‌లో వెళ్తొంది
- April 28, 2017
ప్రపంచంలోనే అత్యధిక బరువు కలిగిన ఈజిప్టు మహిళ ఎమాన్ అహ్మద్ ముంబయిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికిత్స అనంతరం సగానికిపైగా బరువు తగ్గిన ఆమెను యూఏఈకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో సుమారు 500 కేజీల బరువుతో ఉన్న భారీకాయురాలైన ఈ మహిళను ఛార్టర్డ్ కార్గో విమానంలో ముంబయికి తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు 176 కేజీల బరువున్న ఆ మహిళను సాధారణ విమానంలో బిజినెస్ క్లాస్ ప్యాసింజర్‌గా అబుదాబికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
‘ఎమాన్‌ను ఛార్టెడ్ కార్గో విమానంలో ఇక్కడకు తీసుకువచ్చారు. ఇప్పుడు చికిత్స అనంతరం విమానంలో బిజినెస్ క్లాస్‌లో ఆమెను తరలిస్తున్నాం. గత ఏడాది సెప్టెంబర్‌లో 500కేజీల బరువున్న ఆమె.. ప్రస్తుతం 176.6 కేజీలు ఉన్నారు.’ అని ముంబయి సైఫీ ఆస్పత్రికి చెందిన బేరియాట్రిక్ సర్జరీ సెక్షన్ చీఫ్ అపర్ణా భాస్కర్ వెల్లడించారు. ఎమాన్‌ను అబుదాబిలోని బూర్జిల్ ఆస్పత్రికి తరలించనున్నారు. వీపీఎస్ హెల్త్‌కేర్ గ్రూప్‌లో భాగమైన ఈ ఆస్పత్రి వైద్యులు బుధవారం ముంబయిలో ఎమాన్‌ను ఆమె సోదరి షైమా అభ్యర్థన మేరకు పరిశీలించారు. అబుదాబిలో ఆమెకు రెండోదశ ఫిజియోథెరపీని కొనసాగించనున్నారు. ఎమాన్‌కు అందిస్తున్న వైద్యంపై ఆమె సోదరి షైమా వైద్యులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎమాన్ బరువు తగ్గలేదని, వైద్యులు అబద్దం చెబుతున్నారని ఆమె పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్‌కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్‌షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం









