ఉప ఎన్నికల ఫై తెలంగాణా నేతలకు టెన్షన్ నెలకొంది
- October 04, 2015
తెలంగాణాలో ఉప ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఇప్పటికే వరంగల్ ఉపఎన్నికపై అన్ని పార్టీలు కన్నేయగా.. తాజాగా నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికపై చర్చ ఊపందుకుంది. రెండు స్థానాలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడుతున్నట్లు వార్తలు వస్తుండటంతో.. అధికార పార్టీ అందుకు సిద్ధమవుతోంది. నారాయణఖేడ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా..లేదా అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికలు త్వరలో జరగునున్న వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికలకు అధికార పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రెండు స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోంది. వరంగల్ పార్లమెంట్ స్థానం కోసం అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందన్న ప్రచారంతో.. పార్టీ నేతలు టికెట్ దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అధికార పార్టీ టికెట్ దక్కితే విజయం సులువే అన్న ధీమా నేతల్లో కనిపిస్తోంది. అయితే బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు గులాబి పార్టీ పెద్దలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎంత పోటీ ఉన్నా గెలుపు గుర్రానికే ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. నారాయణఖేడ్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతితో నారాయణఖేడ్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ రెండు ఉప ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని అటు అధికార పార్టీ.. ఇటు విపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ఇప్పటినుంచే రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అయితే ఈ సీట్‌పై టీఆర్ఎస్ నేతలు ఇంకా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. హైకమాండ్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏకగ్రీవానికి కాంగ్రెస్ ప్రయత్నాలు నారాయణఖేఢ్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో ఏకగ్రీవం చేయాలని ఆ పార్టీ కోరుతోంది. కానీ గులాబి బాస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు వెలువడలేదని సమాచారం. దీంతో స్థానిక నేతలు పోటీ తప్పదనే అంచనాకు వస్తున్నారు. అయితే చివరి నిమిషం వరకు పరిస్థితులు ఎలా మారుతాయో తెలియక వారిలో టెన్షన్ నెలకొంది. పరిస్థితులు ఎలా మారినా.....ఎన్నికలకు సిద్ధంగా ఉండేందుకు జిల్లా నేతలు రెడీ అవుతున్నారు. ఏదీ ఏమైనా రెండు ఉప ఎన్నికల స్థానాలకు గులాబీ బాస్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది సర్వాత్ర ఆసక్తి రేపుతోంది.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







