మంచు మనోజ్‌ ద్విపాత్రాభినయం

- April 29, 2017 , by Maagulf
మంచు మనోజ్‌ ద్విపాత్రాభినయం

మంచు మనోజ్‌ ఎల్‌.టి.టి.ఈ మిలిటెంట్‌ చీఫ్‌ ప్రభాకరన పాత్ర పోషిస్తున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకత్వం వహిస్తున్నారు. అనీషా ఆంబ్రోస్‌ కథానాయిక. ఎస్‌.ఎన.రెడ్డి, లక్ష్మీకాంత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదివారంతో చివరి షెడ్యూల్‌ పూర్తవుతుంది. కథానాయిక ఫస్ట్‌ లుక్‌ను శనివారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ''1990ల కాలంనాటి శ్రీలంక యుద్దం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మనోజ్‌ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు.
అనీషా ఆంబ్రోస్‌ జర్నలిస్ట్‌గా కనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకం. ఇటీవల విడుదల చేసిన హీరో లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఆదివారంతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. త్వరలో ట్రైలర్‌ను, పాటల్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు. మిలింద్‌ గునాజీ, పోసాని, సుహాసిని, బెనర్జీ, జెన్నిఫర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.కోదండరామరాజు, ఎడిటర్‌: కార్తిక శ్రీనివాస్‌, సంగీతం: శివ నందిగామ, స్కీనప్లే: గోపీమోహన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com