100 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్న మోడల్ చివరకి మృతి
- May 01, 2017
శరీరాకృతి... రంగుల పై కొంత మంది సెలబ్రేటీలకు విపరీతమైన మోజు ఉంటుంది.. తమకు ఉన్న రంగుని శరీరాకృతిని మార్చుకోవడానికి పదే పదే ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించి చిన్న వయసులోనే మృత్యువు పాలవుతున్న సెలబ్రెటీలు ఎందరో.. ప్రఖ్యాత గాయకుడు మైఖేల్ జాక్సన్ తన శరీరం రంగుని, ఆకృతిని మార్చుకొని తీవ్ర అనారోగ్యం పాలై మృతి చెందిన సంగతి విధితమే.. ఇక ఆర్తి అగర్వాల్ కూడా లైపో సర్జరీ వికటించడంతో అతి చిన్న వయసులోనే మృతి చెందింది.. తాజాగా శరీరాకృతిని మార్చుకోవడానికి అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని నిత్యం వార్తల్లో ఉన్న ప్రముఖ మోడల్ క్రిస్టినా మార్టేల్లీ ఆకస్మికంగా మృతి చెందింది.. ఓ కాస్మోటిక్ సర్జరీ జరుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆమె మృతి చెంది నట్లు డాక్టర్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే...
క్యూబెక్ లో పుట్టి పెరిగిన 23 ఏళ్ల క్రిస్టినా మార్టేల్లీ శరీరాకృతి నిత్యం మార్చుకోవడానికి 17 ఏళ్ల వయసులోనే ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకోవడం మొదలు పెట్టి ఇప్పటి వరకూ 100 కు పైగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్నదనే టాక్.. ఈ సర్జరీలతో క్రిస్టినా తన ఫోటోలను సోషల్ మీడియాలో హీటెక్కించే లా పోస్ట్ చేసేది.. అంతేకాదు తనకు ప్లాస్టిక్ సర్జరీలంటే ఎందుకంత మక్కువో తన వెబ్సైట్లో రాసుకుంది క్రిస్టినా. "నేను సర్జరీలను చేయించుకోవడానికి ఒకటే కారణం... నా శరీరాన్ని ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా తీర్చి దిద్దుకోవాలని నా కోరిక.. అందువల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తో నాకు ఏ చింతలేదు." అని తన సోషల్ మీడియా లో చెప్పింది.. కాగా తాజాగా డాక్టర్లు ఆమెకు బట్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తుండగా మూర్ఛవచ్చి గుండెపోటుకు గురైనట్టు స్థానిక మీడియా కధనం... ఏప్రిల్ 21న క్రిస్టినా స్నేహితురాలు అమీ ఆండర్సన్ క్రిస్టినా మృతిచెందినట్లు ట్వీట్ చేయడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.. ఏప్రిల్ 18న క్రిస్టినా ఓ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందనీ.. అది వికటించడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురైందనే వార్తలు కూడా చోటు చేసుకొన్నాయి.. కాగా క్రిస్టినా తన కొద్దిపాటి కెరీర్లోనే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదింకుంది. 23 ఏళ్ల క్రిస్టినాకు ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండడం విశేషం.
తాజా వార్తలు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!
- వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం









