ఇండియన్ సూపర్ లీగ్ రెండో సీజన్ పోటీలు ప్రారంభం
- October 04, 2015
చెన్నై జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ప్రారంభ వేడుకలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు.ఈ వేడుకలకు 8 జట్ల ప్రాంచైజీ ఓనర్లతో పాటు కేరళా బ్లాస్టర్స్ కో-ఓనర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్,ముఖేష్ అంబానీ,నీతా అంబానీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఆఖర్లో ఏ ఆర్ రెహ్మాన్ జాతీయ గీతం ఆలపించిన తర్వాత .....అధికారికంగా ఇండియన్ సూపర్ లీగ్ రెండో సీజన్ పోటీలను ఆరంభించారు. ప్రారంభవేడుకaల్లో బాలీవుడ్ బ్యూటీ .. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ .... ఇండియన్ సూపర్ లీగ్ రెండో సీజన్ పోటీల ప్రారంభవేడుకల్లో బాలీవుడ్ బ్యూటీ..మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్, రీసెంట్ సెన్సేషన్ ఆలియా భట్ సందడి సందడి చేశారు.షాన్‌దార్, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాల్లోని హిట్ సాంగ్స్‌కు డాన్స్ చేసిన ఆలియా భట్....అభిమానులను ఉర్రూతలూగించింది.ఇండియన్ సూపర్ లీగ్ ప్రమోషనల్ సాంగ్‌కు ఆలియా భట్ వేసిన స్టెప్స్ వీక్షకులను చూపు తిప్పుకోనివ్వలేదు.దేవదాస్ సినిమాలోని డోలారే... పాటలకు ఐశ్వర్యారాయ్ చేసిన డ్యాన్స్ పెర్ఫామెన్స్ ప్రారంభవేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







