రానున్న మార్పుల వల్ల 3.5 కోట్ల మంది ఉద్యోగాలకు ఎసరు!
- May 02, 2017
ప్రపంచవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ప్రధాన రంగాల్లో ఈ రంగం ఒకటిగా ఎదిగిన విషయం తెల్సిందే. ఈ రంగంలో చోటు చేసుకుంటున్న రోబోఠఙక్ సాంకేతిక పరిజ్ఞానం మరో 30 ఏళ్ల నాటికి యాభైశాతం కార్మికులను రోడ్డున పడేయనుంది. ముఖ్యంగా 2025 సంవత్సరం నాటికి భవన నిర్మాణ రంగంలో భారత్ ప్రపంచంలోనే మూడవ దిగ్గజ దేశంగా ఎదుగుతున్న అంచనాల నేపథ్యంలో కార్మికుల పట్ల ఇది ప్రతికూల పరిణామమే.
న్యూయార్క్‌లోని ఓ కంపెనీ తయారు చేసిన సెమీ ఆటోమేటిక్ మిషన్లు (ఎస్‌ఏఎం) ఇప్పటికే ఇటుక గోడల నిర్మాణంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని అమెరికాలో ఉపయోగిస్తుండగా, త్వరలోనే బ్రిటన్‌లో ఉపయోగించనున్నారు. మానవులు రోజుకు 500 ఇటుకలతో కూడిన గోడను నిర్మించగలిగితే ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్లు రోజుకు 3000 ఇటుకలతో గోడలను నిర్మించగలుగుతున్నాయి. ఈ విషయంలో పెర్త్‌లోని ఓ రోబోటెక్ కంపెనీ ఇంతకన్నా అధునాతనమైన రోబో యంత్రాలను కనిపెట్టాయి. ప్రయోగాత్మక పరీక్షలు కూడా విజయవంతం అవడంతో ఆ కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి వీటిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటోంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







