బహ్రెయిన్‌ పార్కుల అభివృద్ధికి నిధుల సమస్య

- October 04, 2015 , by Maagulf
బహ్రెయిన్‌ పార్కుల అభివృద్ధికి నిధుల సమస్య

బహ్రెయిన్‌లో పార్కుల అభివృద్ధికి నిధుల సమస్య వెంటాడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో, ముడిచమురు అమ్మకాలే ప్రధాన ఆదాయం కలిగిన బహ్రెయిన్‌ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో పార్కుల అభివృద్ధి కోసం కొత్తగా నిధుల కేటాయింపు కష్టమని సదరన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ అహ్మద్‌ అన్సారీ చెప్పారు. 40 పార్క్‌లను అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించినా, వాటి అభివృద్ధి ఇప్పట్లో జరిగేందుకు పరిస్థితులు ప్రస్తుతం అనుకూలించడంలేదు. బహ్రెయిన్‌ బడ్జెట్‌ లోటు 1.5 బిలియన్‌లకు చేరుకోవడంతో ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కారణంగానే మాంసంపైనా సబ్సిడీని ఎత్తివేశారు. పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని పాలకులు కోరుతున్నారు. అయితే పార్కులు, పర్యాటక ప్రదేశాల్లోని సౌకర్యాల లేమి తమకూ బాధ కలిగిస్తుందని, ప్రైవేటు సంస్థలు ముందుకొస్తే, అభినందిస్తామని అహ్మద్‌ అన్సారీ చెప్పారు. ఇంకా బడ్జెట్‌ కేటాయింపులు జరగనందున పార్కుల అభివృద్ధిపై ఆశలు వదిలేసుకోవాల్సిన అవసరం లేదనీ, ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతైనా పార్కుల కోసం నిధులు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు అహ్మద్‌ అన్సారీ. 

 

--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com