ప్రిన్స్ మిశల్ బిన్ అబ్దులాజిజ్ మృతి

- May 03, 2017 , by Maagulf
ప్రిన్స్ మిశల్ బిన్ అబ్దులాజిజ్ మృతి

ప్రిన్స్ మిశల్ బిన్ అబ్దుల్జిజ్ బుధవారం మరణించినట్లు రాచరికపు న్యాయస్థానం (రాయల్ కోర్ట్ ) ఒక ప్రకటనలో తెలిపింది.గురువారం మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద ఇషా ప్రార్థన తరువాత ఆయనకు అంత్యక్రియలు జరుపుతారు.ప్రిన్స్ మిశల్ రాయల్ ఫ్యామిలీ లో  సీనియర్ సభ్యుడు మరియు అల్లైజెన్ కౌన్సిల్ చైర్మన్ గా ఉండేవారు.1951 నుండి 1953 వరకు ఆయన రక్షణ మంత్రిగా దేశానికి సేవలు అందించారు. అదేవిధంగా, ఆయన1963 నుండి 1971 వరకు మక్కా ఎమిర్ గా  సైతం ఆయన పని చేశారు. చివరిగా ప్రిన్స్ మిశల్ డిసెంబరు 2007 లో అఖిలెన్స్ కౌన్సిల్ ఛైర్మెన్ గా నియమించబడ్డారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బుధవారం అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ నుండి ఒక ఫోన్ కాల్ అందుకున్నారు, ప్రిన్స్ మిశల్ మరణంతో సంతాపం తెలియచేసారు. రాజు అతని ద్వారా వ్యక్తపరిచిన ఉన్నత భావాలకు అల్ బషీర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com