భారత్ లోని సాయుధ దళాలకు శుభవార్త
- May 03, 2017
సాయుధ దళాల ప్రధాన డిమాండుకు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. వారికి వికలాంగ పింఛను చెల్లింపునకు పాత విధానమైన శాతాల వారీ లెక్కింపునే అనుసరించాలని నిర్ణయించింది. శ్రేణుల వారీగా లెక్కించాలని ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సును పక్కనపెట్టింది. వేతన శ్రేణులు, బ్రిగేడియర్ స్థాయి నుంచి పదోన్నతులు పొందిన వారికి వేతన భద్రత కల్పించడం తదితర సమస్యల పరిష్కారానికి కూడా సుముఖత తెలిపింది. 2016కు ముందున్న పింఛనుదార్లకు పింఛను చెల్లింపులో మార్పులుచేయడానికి కూడా అంగీకరించింది. 2016 జనవరి ఒకటి నుంచి ఇవి వర్తించేలా నిర్ణయం తీసుకుంది. నూతన సూత్రం ప్రకారం పింఛను చెల్లిస్తారు.
నూతన ఉక్కు విధానానికి ఆమోదం.. నూతన ఉక్కు విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2030 నాటికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ అవసరాల కోసం దేశంలో తయారయిన ఉక్కు ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఉక్కు ఉత్పత్తికి అవసరమయ్యే కోకింగ్ కోల్, ఇతర ఉత్పత్తుల దిగుమతులను క్రమేణా తగ్గించాలని పేర్కొంది. చిన్న, మధ్యతరహా ఉక్కు పరిశ్రమలకు ప్రాధాన్యం కల్పించనుంది. పరిశోధనల కోసం ప్రత్యేకంగా స్టీల్రీసెర్చ్అండ్ టెక్నాలజీమిషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేయనుంది.
బ్యాంకుల మొండి బకాయిల విషయమై ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









