పద్మశ్రీ అల్లురామలింగయ్యపై దాసరి దాసరినారాయణరావు కామెంట్
- May 04, 2017
కిమ్స్ లో సుధీర్ఘ చికిత్స పొందిన ప్రముఖ దర్శకుడు..దర్శకరత్న దాసరినారాయణరావు మొదటి సారి మీడియాతో మాట్లాడారు. తాను గొంతు తెరిచి నాలుగు మాసాలు అయిందని, పది రోజుల క్రితమే గొంతు వచ్చిందన్నారు. దాసరి పుట్టిన రోజు సందర్భంగా అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని చిరంజీవి దాసరికి అందజేశారు. అవార్డును తన తరపున చిరంజీవి అందుకుని, ఈ రోజున దీనిని తనకు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
లైఫ్ లో ఎన్నో రకాల అవార్డులు పొందానని, కానీ, ఈ అవార్డు తన సొంత మనుషులు ఇచ్చే అవార్డని అన్నారు. తాను తీసిన ప్రతి సినిమాలోనూ అల్లు రామలింగయ్య నటించారని ఆయనకు ప్రత్యామ్నాయంలేదని దాసరి చెప్పారు. కాగా, చిరంజీవి, మోహన్‌బాబు, అల్లు అరవింద్ తదితర ప్రముఖులంతా దాసరి ఇంటికి వెళ్లి ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఉదయం నుంచీ జూబ్లీహిల్స్ లోని దాసరి నివాసం రాజకీయ, సినీరంగ ప్రముఖులు, అభిమానుల రాకతో సందడిగా మారింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







