ఇరువురు ఇరానీ వ్యక్తులు ఒక భారతీయ డ్రైవర్ ని చంపిన కేసులో విచారణ
- May 05, 2017
ఆ ఇద్దరు ఇరానియన్ హంతకులకు ఆ భారతీయ యువ డ్రైవర్ తో గతంలో ఏ విధమైన శత్రుత్వం లేదు..కారు కిరాయికి మాట్లాడుకొని ఒక నిర్జన ఎడారి ప్రాంతానికి తీసుకెళ్ళి కేవలం మొబైల్ ఫోన్, కొన్ని దుస్తుల కోసం 26 ఏళ్ళ భారతీయ డ్రైవర్ ను కత్తితో పొడిచి హతమార్చారు. గత ఏడాది జనవరి 20 వ తేదీన ఇరాన్ దుండగులు చేసిన దురాగతానికి సంబంధించి షార్జా కోర్టు వద్ద విచారణ జరిపారు, ఒక దోపిడీ చేసే సమయంలో భారాతీయ టాక్సీ డ్రైవర్ ని చంపినట్లు నిందితులు అంగీకరించారు. న్యాయమూర్తి హుస్సేన్ అల్ ఓసుయోఫ్ అధ్యక్షతన వాదోప వాదనలు విన్న షార్జా క్రిమినల్ కోర్ట్, ఆరోపణలకు గురైన ఆ ఇద్దరు ఇరానీయన్లను ఏ.ఏ. మరియు ఎస్,ఎం లుగా గుర్తించి ప్రాసిక్యూషన్ పత్రాలలో ఉన్న సమాచారం చదివి వినిపించారు. కోర్టు రికార్డుల ప్రకారం, ఈ హత్యా ఆరోపణలు గత సంవత్సరం జనవరి 20 వ తేదీన 26 ఏళ్ల భారతీయ డ్రైవర్ హతుడు యొక్క క్యాబ్లో ఆ ఇరానీయఁలు ప్రయాణించారు. ఆ తర్వాత పైన పేర్కొన్న విధంగా చంపివేశారు. షార్జా పోలీస్ యొక్క ఆపరేషన్స్ రూమ్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆల్ నహ్డా ప్రాంతంలో తన కారులో ఒక వ్యక్తి రక్తం మడుగులో ఉన్నట్లు సమాచారం అందింది. విచారణ సమయంలో, పోలీసులు బాధితుడి టాక్సీని పిలిచిన అనుమానితులను గుర్తించగలిగారు. ప్రాసిక్యూషన్ విచారణ సమయంలో, అనుమానితులు తమ నేరాన్ని అంగీకరించారు మరియు ఆ హత్య యొక్క ఉద్దేశం కేవలం దొంగతనం మాత్రమేనని చెప్పారు. అంతే కాక వారు బాధితుడి టాక్సీ నాశనం చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే, ఈ కేసు విచారణ సమయంలో, రెండవ నిందితుడు దోపిడీ, హత్య కేసులలో రానా ప్రమేయం లేదని బుకాయించాడు. ప్రాసిక్యూషన్ విచారణ సమయంలో ఆ నేరాలను ఏ విధంగా ఒప్పుకోన్నావని న్యాయమూర్ ప్రశ్నించగా తనపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నకారణంగా ఆ ఆరోపణను అంగీకరించినట్లు తెలిపాడు. ఇద్దరు సాక్షుల వాదనలను వినడానికి మే 25 వ తేదీకి ఈ కేసుని వాయిదా వేసింది. అలాగే గురువారం కోర్టు విచారణకు హాజరుకాని మొదటి నిందితుడి న్యాయవాదిని కూడా విచారణ సమయంలో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
తాజా వార్తలు
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!









