హైదరాబాద్ లో కార్డన్ సెర్చ్.. 14 మంది నైజీరియన్ల అరెస్ట్
- May 07, 2017నగరంలోని టోలీచౌకీ ఏరియా ఐఏఎస్ నగర్, బృందావన్ నగర్, ఫాతిమానగర్ కాలనీలలో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 63 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 14 మంది నైజీరియన్లు ఉన్నారని వీరిని విచారించి పత్రాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విదేశీయులు నివాసం ఉండే ఇంటి ఓనర్లను అడిగి వారి వివరాలు తెలుసుకుంటామన్నారు.
గోల్కొండ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 300 మంది పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వయించాయి. 63 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ఎలాంటి పత్రాలు లేనివిగా గుర్తించిన 103 బైకులు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముఖ్యంగా విదేశీయుల కదలికలపై పోలీసులు దృష్టిపెట్టినట్లు సమాచారం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







