సూపర్ స్టార్ రజనీతో కాంగ్రెస్ లీడర్, ప్రముఖ హీరోయిన్ నగ్మా భేటీ

- May 07, 2017 , by Maagulf
సూపర్ స్టార్ రజనీతో కాంగ్రెస్ లీడర్, ప్రముఖ హీరోయిన్ నగ్మా భేటీ

తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్‌ను అలనాటి హీరోయిన్, కాంగ్రెస్ నేత నగ్మా కలిశారు. చెన్నైలోని రజనీ నివాసంలో ఆమె ఆయన్ను కలిశారు. అయితే.. రజనీతో నగ్మా సమావేశానికి గల కారణాలు తెలియరాలేదు. రజనీకాంత్‌ను కలిసినట్టు నగ్మా తన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆయనతో సమావేశం చాలా ఆనందాన్నిచ్చిందని, పలు అంశాలపై రజనీతో చర్చించానని ఆమె ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే.. రజనీతో ఆమె ఏ విషయాలు చర్చించారన్నది మాత్రం వెల్లడించలేదు. మామూలుగానే రజనీని కలిశారా..? లేదా ఆ సమావేశానికి ఏదైనా రాజకీయ ప్రాధాన్యం ఉందా..? అని కోలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం నగ్మా కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె రజనీతో కలిసి భాషా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com