ఆదాయపు పన్ను ఎగ్గొట్టిన తెలుగోళ్ళు

- May 07, 2017 , by Maagulf
ఆదాయపు పన్ను ఎగ్గొట్టిన తెలుగోళ్ళు

ఆదాయపు పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టిన వాళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాల వారే ఎక్కువట. తెలంగాణా నుంచి 25, ఏపీ నుంచి అయిదుగురు.. మొత్తం 30 మంది ట్యాక్స్ డిఫాల్ట ర్స్ ఉన్నారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు రిలీజ్ చేసిన డేటా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా డిఫాల్టర్స్ అయిన 96 కంపెనీలు, వ్యక్తుల పేర్లను ఈ బోర్డు వెల్లడించింది. వీళ్ళంతా మొత్తం 1,046 కోట్ల పన్నులను చెల్లించాల్సి ఉంది. టాప్ ఫైవ్ లిస్టులో టోటేమ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీ 401.64 కోట్లు, రాయల్ ఫ్యాబ్రిక్స్ 158.94 కోట్లు, నెక్సో ఫిట్ ఇన్ ఫో టెల్ 68.21 కోట్లు, కృషి వెంకటేశ్వర రావు 49.2 కోట్లు, జేనేక్స్ టెక్నాలజీస్ సంస్థ 47.04 కోట్లు చెల్లించాల్సి ఉందని ఈ డేటా పేర్కొంది.
పన్ను చెల్లించని వారిని అరెస్టు చేయాలని, వారి ఆస్తులను జప్తు చేయాలని, ఇందుకు ఆదాయపు పన్ను చట్టం లోని 276 సీ (2) సెక్షన్ కింద గల నిబంధనలను ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటివారికి 3 నెలల నుంచి మూడేళ్ళ వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ పేరిట ఓ అధికారికి ఇందుకు గాను ప్రత్యేక అధికారాలు ఇస్తారు. కాగా పన్ను ఎగ్గొట్టిన కంపెనీలు, వ్యక్తుల లిస్టు ఇలా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com