అమెరికాలో మరో దారుణం: 'సిగరేట్' కోసం భారతీయుడి హత్య

- May 09, 2017 , by Maagulf
అమెరికాలో మరో దారుణం: 'సిగరేట్' కోసం భారతీయుడి  హత్య

అమెరికాలో జరుగుతున్న వరుస భారతీయుల హత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో భారతీయుడి హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన జగ్‌ జీత్ సింగ్‌ (32) 18 నెలల క్రితం అమెరికా వచ్చారు.
ఆయన హట్చ్ ఫుడ్, గ్యాస్ కన్వీనియెన్స్ స్టోర్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఆయనను ఒక వ్యక్తి వచ్చి సిగిరెట్లు కావాలని అడగడంతో.. మైనర్ ఏమో అని అనుమానం వచ్చిన జగ్ జీత్ సింగ్ ఐడీ చూపించాలని కోరాడు. కాగా, విధులు పూర్తి చేసి, బయటకు వచ్చిన జగ్ జీత్ సింగ్‌ను ఆ వ్యక్తి జాత్యహంకారంతో దూషిస్తూ, కత్తితో పొడిచేశాడు.
గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 9 గంటలపాటు చికిత్స పొందిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా, వారం వ్యవధిలోనే వరుసగా భారతీయులు హత్యకు గురికావడం పట్ల ఆందోళన నెలకొంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com