'కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్' సినిమా ప్రారంభం
- May 10, 2017
శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్ అండ్ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్'. కళ్యాణ్, లక్ష్మీశిల్ప హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అనంతరం నటి కవిత తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా నిర్మాత సాయివెంకట్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రముఖ దర్శకులు సాగర్ ఈ చిత్రం తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర నిర్మాత టి. రామకృష్ణ మాట్లాడుతూ.. చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన అతిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జూన్ మొదటివారం నుండి చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. విశాఖపట్నం, అరకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మొదటి షెడ్యుల్ షూటింగ్‌ని ప్లాన్ చేశాము...అని తెలిపారు.
కళ్యాణ్, లక్ష్మీశిల్ప, పోసాని కృష్ణమురళీ, సాయికుమార్, కవిత, విజయ్, వెంకటేష్ మరియు నూతన నటీనటులు నటించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్: జయసూర్య, ఎడిటింగ్: నందమూరి హరి, కెమెరా: మహిషర్ల, నిర్మాత: టి. రామకృష్ణ, దర్శకత్వం: సత్య.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







