మే 15 వ తేదీన వైట్‌హౌస్‌లో ట్రంప్ ను కలవనున్న అబుదాబి క్రౌన్ ప్రిన్స్
- May 10, 2017
అమెరికాలోని వైట్ హౌస్ లో వచ్చే సోమవారం ( మే 15 న ) అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహ్మద్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కలవనున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి సీన్ స్పీసర్ తెలిపారు. ఈ సమావేశం ద్వారా మధ్యప్రాచ్య దేశాలలోని తన కీలక భాగస్వాములతో అమెరికా తన సహకారాన్ని మరింత బలపరచనుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన వైట్ హౌస్ లో అబుదాబి రాజు, యుఏఈ సాయుధ దళాల డిఫ్యూటీ కమాండర్ శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు గౌరవ ఆతిథ్యం ఇవ్వనున్నారు. సౌదీ అరేబియాలో ప్రారంభం కానున్న ట్రంప్ తన మొట్టమొదటి అధికార విదేశీ పర్యటనకు ముందే ఈ సమావేశం జరగనుంది. మధ్యప్రాచ్యంలో శాంతి ప్రోత్సహించడానికి మరియు ప్రాంతం నుండి డాష్ను వేరుచేయడానికి అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదుల ఏరివేతలో గల్ఫ్‌దేశాల సహాయం కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. తన మొదటి విదేశీ పర్యటన గల్ఫ్‌దేశాలలోనే కొనసాగనుందని ఆయ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్‌దేశాల మైత్రి కోసం ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నారో స్పష్టమవుతోంది. ట్రంప్ పర్యటనకు ముందే అమెరికాలో కీలక భేటీ జరగబోతోంది. అబుదాబి రాజు, యుఏఈ సాయుధ దళాల డిఫ్యూటీ కమాండర్ మహమ్మద్ బిన్ జాయేద్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం భేటీ కానున్నారు. వైట్‌హౌస్‌లో కొనసాగనున్న ఈ భేటీలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు, ఉగ్రవాదంపై పోరులో సహకారం తదితర పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నారని వైట్‌హౌస్ అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









