ఇరాక్ లో బాంబు పేలుళ్లు
- October 05, 2015
, by Maagulf
-
ఇరాక్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాక్ లో మూడు పట్టణాల్లో కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో కనీసం 56 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. బాగ్దాద్ శివారు ప్రాంతం హుస్సేనియా, అల్ ఖలెస్, అల్ జుబెయిర్ లో రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కారు బాంబులు పేల్చారు. అల్ ఖలెస్ లోనే కనీసం 32 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాంబు దాడులకు పాల్పడింది ఎవరన్నదీ ఉగ్రవాద సంస్థలు ప్రకటించలేదు. కాగా ఇరాక్ లో ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం సెప్టెంబర్ నెలలో ఉగ్రవాదుల దాడుల్లో 717 ఇరాక్ పౌరులు మరణించగా, మరో 1216 మంది గాయపడ్డారు.