టుస్సాడ్స్‌లో క్రికెటర్ కపిల్ మైనపు విగ్రహం
- May 11, 2017
టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన క్రికెటర్ కపిల్‌దేవ్ మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. 1983 వరల్డ్ కప్‌లో కపిల్ దేవ్ టీమిండియా కెప్టెన్‌గా ఉన్నారు. కన్నాట్ ప్లేస్‌లోని రీగల్ సినిమా సమీపంలో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియంలో కపిల్ మైనపు విగ్రహాన్ని పెట్టారు. గురువారం జరిగిన వేడుకలో మాజీ ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ తన మైనపు బొమ్మను ఆవిష్కరించారు. టుస్సాడ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 23 కేంద్రాలు ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న మ్యూజియంలో సుమారు 50 మైనపు విగ్రహాలు ఉన్నాయి. క్రీడా, మ్యూజిక్, ఫిల్మ్, టీవీ సెలబ్రిటీలు ఇందులో ఉన్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, మహాత్మా గాంధీ, జాకీ చాన్, సచిన్, లేడీ గాగా మైనపు విగ్రహాలున్నాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







