సౌదీ ఎయిర్ లైనర్ కు బాంబు బెదిరింపు..హడలిపోయిన ప్రయాణికులు
- May 11, 2017
సౌదీ అరేబియా:మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పలువురికి ముచ్చెమటలు పట్టించాడు.. తన చేతిలో బాంబు ఉందని ఇపుడు ఈ విమానం పేల్చేస్తానంటూ...పెద్దగా కేకలు వేస్తూ, నానా హడావిడి చేయడంతో పలువురు విమాన ప్రయాణికులు హడలిపోయారు. సౌదీ అరేబియా లోని జెడ్డా నుంచి కైరోకు వెళుతున్న సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లయ్నస్ విమానంలో ఈ ఘటన జరగడంతో మంగళవారం విమాన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈజిప్ట్ కు చెందిన వస్త్ర కర్మాగారానికి చెందిన రిటైర్డ్ కాబడిన 61 ఏళ్ల వ్యక్తిని ఈజిప్టు రాజధానిలో ఉన్నపుడు భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ఆ వ్యక్తి అసలు తాను ఏమి చేశానో గుర్తు రావడం లేదని పోలీసులతో పేర్కొన్నాడు.దాంతో ఆ వ్యక్తి మానసిక స్థితిని పరీక్షించడానికి ఒక మనోరోగ వైద్యుడి చెంతకు పంపించాలని భావిస్తున్నారు. రాష్ట్ర వార్తాపత్రిక ఆహారంగాతె కధనం ప్రకారం, అదుపులోనికి తీసుకొన్నవ్యక్తి వద్ద ఏ విధమైన ఆయుధాలు కానీ, పేలుడు పదార్ధాలు వంటివి ఏ మాత్రం దొరకలేదని తెలిపింది. ఈజిప్టులో ఈ ఘటన ఎయిర్ సెక్యూరిటీకి సున్నితమైన అంశం కావడంతో వారు అప్రమత్తమైపోయారు గత ఏడాది ఒక ఈజిప్టు విమాన ప్రమాద కారణం ఇప్పటికి తెలియని స్థితిలో మధ్యధరా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో 66 మంది దుర్మరణం చెందారు. అదేవిధంగా 2015 లో ఒక రష్యన్ విమానం సినాయ్పలో దిగింది. ఆ విమానంలోని 224 మంది ప్రయాణికులను డెయిష్ తీవ్రవాద సంస్థ అమానుషంగా కాల్చి చంపింది.. ఆ ఘటనలు ఇంకా మరవని ఈజిప్టు విమాన ప్రయాణికులు మతిస్థిమితం లేనివ్యక్తి హెచ్చరిక విని గజ గజ వణికిపోయారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







