క్యాన్సర్‌తో బహ్రెయిన్‌లో చెల్లె అనంత లక్ష్మి మృతి

- May 11, 2017 , by Maagulf
క్యాన్సర్‌తో బహ్రెయిన్‌లో చెల్లె అనంత లక్ష్మి మృతి

బహ్రెయిన్ :క్యాన్సర్‌ బారిన పడి బహ్రెయిన్‌లో చెల్లె అనంతలక్ష్మి మృతి చెందారు. హౌస్‌ మెయిడ్‌గా ఆమె పనిచేస్తున్నారు. ఆమె భర్త, బహ్రెయిన్‌లోని ఓ క్లీనింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన వీరికి ముగ్గురు పిల్లలు, ఇండియాలో చదువుకుంటున్నారు. క్యాన్సర్‌ కేర్‌, ఆమె భర్తకు బహ్రెయిన్‌ నుంచి హైద్రాబాద్‌కి టిక్కెట్‌ సమకూర్చగా, ఆమె స్పాన్సరర్‌ ఫార్మాలిటీస్‌ పూర్తి చేశారు. ఎపిఎన్‌ఆర్‌టి, హైద్రాబాద్‌ నుంచి ఆమె స్వస్థలానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సహకారంతో ఏర్పాటు చేసింది. అంబులెన్స్‌ని ఏర్పాటు చేసిన కె.సుధాకర్‌ రావు కి అభినందనలు. ఐసిఆర్‌ఎఫ్‌, ఎపిఎన్‌ఆర్‌టితో కలిసి తెలుగు కళా సమితి వైస్‌ ప్రెసిడెంట్‌ శివకుమార్‌ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించారు. ఆర్థికంగా ఆ కుటుంబానికి ఆరు నెలలపాటు అండగా ఉండేందుకు ఐసిఆర్‌ఎఫ్‌ ముందుకొచ్చింది. ఇండియన్‌ ఎంబసీ సహకారంతో తెలుగు కళా సమితి, ఆమె కుటుంబానికి తగిన సహాయం చేయనుంది.

--యం. వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com