మక్కా అగ్నిప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి

- May 12, 2017 , by Maagulf
మక్కా అగ్నిప్రమాదంలో  ముగ్గురు కార్మికులు మృతి

ఇటీవల ఎడారి దేశాలలో అగ్నిప్రమాదాలు జోరందుకొని నిండు ప్రాణాలను సజీవ దహనం చేస్తున్నాయి. మక్కాలోని ఒక వడ్రంగి గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు కాలి  బుగ్గిగా మారేరు. అగ్నిప్రమాద సమాచారం తెలియడం గానే సివిల్ డిఫెన్స్ బృందాలు హజ్ వీధిలోని ఘటనా స్థలానికి  తరలించారు.అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రణలోనికి తీసుకొచ్చారు. భవనం లోని రెండో అంతస్తులో ఉన్నగిడ్డంగి లోపల అగ్నిప్రమాదం జరిగింది. ఇనుప లోహంతో నిర్మించిన ఒక గదిలో కార్మికులు ఆదమరిచి నిద్రపోతున్నారు. ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఆ ప్రాంతాంన్ని ఒక్కసారిగా చుట్టిముట్టాయి. కార్మికులు నిద్రిస్తున్న ఆ గది లోపలకు వెళ్లేందుకు వచ్చేందుకు కేవలం ఒకే ఒక ఇనుప నిచ్చెన మాత్రమే ఉంది. దీనితో భగ భగలాడుతూ తరుముకొస్తున్న మృత్యువుని తప్పించుకోలేకపోయారు. ఈ అగ్నిప్రమాదం జరిగినపుడు ఆ ఇనుప గదిలో విపరీతమైన వేడి పెరిగి ఆ ముగ్గురు కార్మికులు అక్కడే చనిపోయినట్లు సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మేజ్ నయిఫ్ అల్-షరీఫ్ " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధికి తెలిపారు. అలాగే , ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల వాస్తవ కారణం అన్వేషణ కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com