కెన్యా బస్సుప్రమాదంలో 19 మంది మృతి...
- May 13, 2017నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రక్లు, ఒక బస్సు ఢీకొట్టుకోవడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్ది వారాల వ్యవధిలో కెన్యాలో ఇటువంటి రోడ్డు ప్రమాదం జరగడం ఇది రెండోసారి. వాయువ్య నైరోబీకి 120 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామం వద్ద ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్లు ఒకదానికొకటి దాటే సమయంలో బస్సును ఢీకొట్టడంతో 18 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసు కమాండర్ హస్సన్ బర్హా వెల్లడించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడని చెప్పారు. ట్రక్ల డ్రైవర్లతో సహా మరికొందరు చికిత్స పొందుతున్నారని వివరించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో నైరోబీ, మోంబాసా జాతీయ రహదారిపై బస్సు, ట్రక్ ఢీకొన్న ప్రమాదంలో 26 మంది మరణించారు. గత డిసెంబరులో ఓ ట్యాంకర్ బీభత్సం సృష్టించడంతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







