రజని అభిమానులకు గుర్తింపుకార్డులు తప్పనిసరి
- May 13, 2017
సూపర్‌స్టార్‌ను కలిసే అభిమానులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి. లేకుంటే వారు ఎంతటి వీరాభిమానులైనా నోఎంట్రీ. ఏమిటిదంతా అనేగా మీ ఆసక్తి. రజనీకాంత్ రేపటి (సోమవారం)నుంచి ఐదురోజుల పాటు ఆయన అభిమానులను జిల్లాల వారిగా కలవనున్నారు. చాలా కాలం తరువాత ఆయన అభిమానుల కల నెరవేరబోతోంది. అయితే ఈ పరిణామం రాజకీయవర్గాల్లో గట్టి కలవరానికే దారి తీస్తోంది.
రజనీకాంత్ రోజుకు మూడు జిల్లాలకు చెందిన అభిమానులు చొప్పున ఈ నెల 19 తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగి మంచి విందును ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణమండపం వేదిక కానుంది. అందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌ను కలిసే అభిమానులకు గుర్తింపు కార్డులను అందించడం జరిగింది.
అవి ఉన్న వారికే అనుమతి అని, గుర్తింపు కార్డులు లేని వారు దయచేసి రావద్దని శనివారం రజనీకాంత్ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా రజనీకాంత్‌తో మాట్లాడాలని ప్రయత్నించడం గానీ, రాజకీయ ప్రస్తావన తీసుకురావడం గానీ, రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేయడం లాంటివి చేయకూడదని నిబంధనలు విధించడం జరిగిందని సమాచారం.
తాజా వార్తలు
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్







