సినీకవుల సాయంకోరిన తెలంగాణ సీఎం కేసీఆర్

- May 14, 2017 , by Maagulf
సినీకవుల సాయంకోరిన తెలంగాణ సీఎం  కేసీఆర్

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కవులను కోరారు. సినీ కవులు, రచయితలు, కళాకారులతో భేటీలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కెసిఆర్ చెప్పారు.
సాగునీటి రంగానికి ప్రతీ ఏటా రూ.25వేల కోట్లు, రూ.500 కోట్లతో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నాని వెల్లడించారు. కొత్తగా 2 వేల మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతోన్న అన్ని సంక్షేమ పథకాలను ఆట, పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవులను కెసిఆర్ అభ్యర్థించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com