అలా అయితే ఎల్లో బాక్స్‌లు వృధా
- May 15, 2017
ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఎల్లో బాక్స్‌ల వల్ల ప్రయోజనం లేకుండా పోతోందని ఎంపీ డాక్టర్ జమీలా అల్ సమ్మక్, హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో ఆక్షేపించారు. టైమర్స్ పనిచేయని పక్షంలో, ఎల్లో బాక్స్‌ల కాన్సెప్ట్‌కి అర్థం లేదని ఆమె అన్నారు. టైమర్ పని చేయకపోతే, ఆ సమయంలో ఎల్లో బాక్స్‌లోకి వచ్చిన వాహనం, సడెన్‌గా అక్కడ రెడ్ లైట్ పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జమీలా అల్ సమ్మక్ చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రాణాలను కాపాడటానికి తప్ప ఆదాయాన్ని జనరేట్ చేయడం కోసం కాదని అన్నారామె. 50 కిలోమీటర్ల వేగ పరిమితితో కూడిన రోడ్లపై 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళే వాహనానికి జరీమానా విధించడం వల్ల ప్రాణాల్ని కాపాడగలమా? అని ప్రశ్నించారు జమీలా. మే 1 నుంచి రోడ్లపై ఏర్పాటు చేసిన స్మార్ట్ కెమెరాలు, ఎల్లో బాక్స్ నిబంధనల ఉల్లంఘనను పట్టివ్వనున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









