వెనక్కి జరుగుతున్న ట్రక్కు కింద పడి మృతి చెందిన భారతీయ కార్మికుడు
- May 15, 2017
మనామ: పని చేసేచోట కార్మికులు అప్రమత్తంగా లేకపోతే ఎటువంటి అనర్ధాలు జరుగుతాయో ఈ వార్త రుజువు చేస్తుంది. ఒక నిర్వాసిత కార్మికుడు ఆదివారం ఆస్కార్ లో తాను పని చేసే స్థలంలో తిరోగమన ట్రక్కు కింద పడి నలిగిపోయి మరణించాడు. ప్రవాస భారతీయుడైన మల్లేష్ గవ్వాలా, కాంట్రాక్టు సంస్థతో ఒక కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. ఆదివారం ఉదయం సుమారు11:30 సమయంలో బహ్రెయిన్ ట్రక్కు డ్రైవర్ ట్రక్కును వెనక్కి నడిపిస్తుండగా అది గమనించని మల్లేష్ వెనకకు జరగుతున్న ట్రక్ కింద పడి నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఒక అధికారక సమాచారం ప్రకారం, వెంటనే స్పందించిన బహ్రెయిని డ్రైవర్ మరియు పారామెడిక్ జట్టు తీవ్రంగా గాయపడిన మల్లేష్ ను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆ నిర్వాసిత కార్మికుడు చనిపోయినట్లుగా గుర్తించారు. . ఈ కేసు ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అప్పగించారు. అంతేకాక కార్మిక మంత్రిత్వశాఖ ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









