తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి

- October 06, 2015 , by Maagulf
తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి

బహ్రెయిన్‌ మంత్రి వర్గం నిన్న సమావేశమై తీవ్రవాదంపై ఉక్కు పాదం మోపేందుకు పలు చర్యలు తీసుకోవడంపై చర్చించింది. తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు చేస్తున్న కృషిని మంత్రివర్గం కొనియాడింది. కొత్త చట్టాల్ని తీసుకొచ్చి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రధానమంత్రి ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, గుదైబా ప్యాలెస్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశానికి నాయకత్వం వహించారు. క్రౌన్‌ ప్రిన్స్‌, డిప్యూటీ సుప్రీం కమాండర్‌, ఫస్ట్‌ డిప్యూటీ ప్రీమియర్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కింగ్‌ హమాద్‌కి కృతజ్ఞతలు తెలిపింది మంత్రివర్గం. తీవ్రవాద దుశ్చర్యల్ని సౌదీ అరేబియాలో అడ్డుకోవడం పట్ల మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. తీవ్రవాదాన్ని అణచివేయడంలో సౌదీ అరేబియాకి బహ్రెయిన్‌ అండగా ఉంటుందని మంత్రివర్గం వెల్లడించింది. 

 

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com